OPPO Enco X3i: ఒప్పో ఈరోజు కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈరోజు మార్కెట్లో ఈరోజు విడుదల చేసిన ఒప్పో ఫైండ్ X8 సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో పాటు ఈ కొత్త బడ్స్ ను కూడా ఒప్పో విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను లీనమయ్యే సౌండ్ మరియు గొప్ప నోయిస్ క్యాన్సిలేషన్ తో లాంచ్ చేసినట్లు ఒప్పో తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
OPPO Enco X3i: ఫీచర్స్
ఒప్పో యొక్క ఈ లేటెస్ట్ బడ్స్ X3i డ్యూయల్ డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇందులో 10.4mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్ కలగలిపిన డ్యూయల్ డ్రైవర్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ కేవలం 40.8 గ్రాముల బరువుతో చాలా లైట్ వైట్ గా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ లో అందించిన స్పీకర్లు 15Hz~40KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను ఎలక్ట్రిక్ బ్లూ మరియు మెటర్ గ్రే రెండు కలర్ లలో అందించింది.
ఇక ఈ బడ్స్ కలిగి వున్న ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ బడ్స్ LHDC 5.0 సపోర్ట్ కలిగిన Hi-Res Audio సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ ఒప్పో కొత్త బడ్స్ 49dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఒప్పో కొత్త బడ్స్ టచ్ వాల్యూమ్ కంట్రోల్స్ మరియు గొప్ప సౌండ్ అందించే OPPO Alive Audio సపోర్ట్ ను కూడా కలిగి ఉంటాయి. Enco X3i బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి కనెక్టివిటీ అందిస్తుంది.
ఈ బడ్స్ కేవలం 10 నిముషాల ఛార్జ్ టోన్ 7 గంటల ప్లే బ్యాక్ అందించే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు టోటల్ 44 గంటల ప్లేబ్యాక్ అందించే పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.