HIGHLIGHTS
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ అపి ఈరోజు ఫ్లిప్ కార్ట్ ధమాకా ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు మంచి డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరలో అందుకోవచ్చు. రేపటితో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ నుంచి ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ఆఫర్ తో 30 వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఇదే సరైన సమయం.
Surveyగూగుల్ పిక్సెల్ 7a ఇండియాలో రూ. 43,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ నుంచి రూ. 14,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే, ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ గూగుల్ పవర్ ఫుల్ కెమెరా స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది.
Also Read: Diwali 2024 Wishes కోసం AI సహాయం తీసుకోండి.. ఇన్స్టాంట్ గా విషెస్ పంపండి.!
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ 64MP (OIS) + 13MP పవర్ ఫుల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాతో 4K వీడియోలు మరియు అద్భుతమైన డిటైల్స్ తో గొప్ప ఫోటోలు పొందవచ్చు. ఈ ఫోన్ గూగుల్ Tensor G2 చిప్ సెట్ మరియు ప్రత్యేకమైన సెక్యూరిటీ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ లో 6.1 ఇంచ్ 24 Bit FHD డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 4300 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇంట చవక ధరకు లభించడం ఇదే మొదటిసారి అవుతుంది.