ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చైనా Palm Payment అనే కొత్త టెక్నాలజీ.!

HIGHLIGHTS

ఫిక్షన్ మూవీ ని తలపించేలా Palm Payment Tech తో పేమెంట్

ఈ కొత్త రకం పేమెంట్ ను నెటిజన్లు Living In 2050 అని పిలుస్తున్నారు

పామ్ పేమెంట్ పద్దతి చూడటానికి సరికొత్తగా మరియు చాలా సులభంగా వుంది

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చైనా Palm Payment అనే కొత్త టెక్నాలజీ.!

చైనా లో ప్రసుతం నడుస్తున్న ఒక కొత్త రకం పేమెంట్ టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇతర దేశాల్లో కార్డు ద్వారా పేమెంట్, ఆన్లైన్ పేమెంట్, UPI పేమెంట్ మరియు QR కోడ్ పేమెంట్ లను ఉపయోగిస్తుంటే చైనాలో మాత్రం ఫిక్షన్ మూవీ ని తలపించేలా Palm Payment Tech తో పేమెంట్ చేస్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం అండి బాబు. ఈ కొత్త రకం పేమెంట్ ను చూసిన నెటిజన్లు దీన్ని ‘China Living In 2050’ అని పిలుస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఈ Palm Payment అనే కొత్త టెక్నాలజీ?

ఎటువంటి కార్డ్స్, UPI లేదా ఆన్లైన్ వివరాలతో పని లేకుండా కేవలం అరచేయి చూపడం ద్వారా ద్వారా పేమెంట్ చేయడమే ఈ కొత్త పామ్ పేమెంట్ టెక్నాలజీ. ఇది ప్రస్తుతం చైనా స్టోర్ లలో నడుస్తున్నట్లు చూపిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చైనా 2050 లో జీవిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

పాకిస్తానీ కంటెంట్ క్రియేటర్ Rana Hamza Saif ఈ కొత్త టెక్ ను హైలైట్ చేస్తూ China Living in 2050 పేరుతో ఒక వీడియో తన Instagram అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో అర చేతిని చూపించి పేమెంట్ చేయడం లైవ్ లో చేసి చూపించారు. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్ అయ్యింది.

Also Read: WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ తో యూజర్లకు పండగే.!

ఈ Palm Payment ఎలా చేస్తారు?

వైరల్ వీడియో ప్రకారం, ముందుగా ఈ సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు చైనా లో ఎక్కడైనా పేమెంట్ ను స్కానర్ ఎదురుగా చేతిని చూపడం ద్వారా పే చేయవచ్చు. ఇది కార్డ్స్ మరియు UPI పేమెంట్ కన్నా చాలా వేగంగా ప్రొసెస్ అవుతున్నట్లు వీడియోలో కనిపించింది.

అయితే, ఈ పేమెంట్ మెథడ్ మరియు దీని కోసం ఎటువంటి వివరాలు ముందుగా అందించాలి మరియు పేపర్ వర్క్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ, పామ్ పేమెంట్ పద్దతి చూడటానికి సరికొత్తగా మరియు చాలా సులభంగా ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo