Lava Agni 3: అమోఘమైన డిజైన్ మరియు Dual Screen తో వస్తోంది.!

HIGHLIGHTS

లావా భారత్ లో సరికొత్త ఫీచర్ తో కొత్త 5G మొబైల్ ను లాంచ్ చేస్తోంది

కొత్త Dual Screen తో అప్ కమింగ్ ఫోన్ లావా అగ్ని 3 ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా అమోఘమైన డిజైన్ తో ఆకట్టుకుంటోంది

Lava Agni 3: అమోఘమైన డిజైన్ మరియు Dual Screen తో వస్తోంది.!

Lava Agni 3: ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా భారత్ లో సరికొత్త ఫీచర్ తో కొత్త 5G మొబైల్ ను లాంచ్ చేస్తోంది. ఇప్పటి వరకు భారత మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త Dual Screen తో అప్ కమింగ్ ఫోన్ లావా అగ్ని 3 ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. డిడ్ మాత్రమే కాదు ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా అమోఘమైన డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Agni 3: కీలకమైన ఫీచర్స్

లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను లావా వెల్లడించింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. లావా యొక్క అధికారిక X అకౌంట్ నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది.

Lava Agni 3 Dual Screen

వవ ట్వీట్ ప్రకారం, ఈ ఫోన్ లో ముందు 3D కర్వుడ్ స్క్రీన్ తో పాటు వెనుక కెమెరా ప్రక్కన మరొక చిన్న స్క్రీన్ కూడా ఉన్నట్లు చూపించింది. ఈ వీడియో ప్రకారం, లావా అగ్ని 3 ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ వుంది మరియు అందులో ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు చిన్న సెకండరీ స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ మెయిన్ కెమెరాతో సెల్ఫీ లను తీయడానికి మరియు నోటిఫికేషన్ కోసం కూడా ఉపయోగపడవచ్చు అని ఊహిస్తున్నారు.

లావా అగ్ని స్మార్ట్ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టం ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. దిద మాత్రమే కాదు, Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా క్లియర్ అయ్యింది. ఈ ఫోన్ వైట్ మరియు బ్లూ రెండు కలర్ వేరియంట్లలో కనిపిస్తోంది.

Also Read: Sony BRAVIA 9: అత్యంత ప్రకాశవంతమైన 4K Smart Tv సిరీస్ లాంచ్ చేసిన సోనీ.!

ఇప్పటికే పెరిగిన కాంపిటీషన్ తో అన్ని మొబైల్ కంపెనీలు కూడా తమదైన కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుండగా, ఇండియన్ బ్రాండ్ అయిన లావా కూడా ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేసి తన ఉనికి చాటుకుంది. ఈ ఫీచర్ తో ఇండియన్ మర్కెట్లో ఇప్పటి వరకు ఫోన్ రాలేదు మరియు ఇదే మొదటి ఫోన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo