47th RIL AGM : ఈరోజు 47 వ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగనున్నది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రిలయన్స్ యొక్క ఈ అతిపెద్ద మీటింగ్ ఆగస్టు నెలలో జరగనున్నది. ఈ మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ మరియు కంపెనీ అప్ కమింగ్ ప్లాన్స్ ను ప్రకటించింది.
Survey
✅ Thank you for completing the survey!
47th RIL AGM
47 వ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా LIVE లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా లైవ్ లో చూసే అవకాశం రిలయన్స్ అందించింది.
47 వ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లైవ్ కార్యక్రమాన్ని కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్, Facebook (Live Link), X (ట్విట్టర్) మరియు Jio ఛానెల్ ద్వారా చూడవచ్చు. మీరు లైవ్ ఇక్కడ కూడా ఈ లైవ్ ను చూడవచ్చు.
ఈ మీటింగ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు?
47 వ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ నుంచి షేర్ హోల్డర్స్ కోసం బిగ్ అందిస్తుందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు రిలయన్స్ రిటైల్ మరియు Jio కోసం IPOs ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఈ మీటింగ్ లో అతిపెద్ద న్యూస్ కానున్నది అని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి.
మీ మీటింగ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (MD) ముఖేష్ అంబానీ 35 లక్షల మంది షేర్ హోల్డర్స్ కోసం కొత్త అప్డేట్ మరియు ఈ సంవత్సర షేర్ వివరాలు గురించి అడ్రస్ చేస్తారు. అంతేకాదు, ఈ మీటింగ్ నుంచి కొత్త ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.