కేవలం రూ. 13,999 ధరకే 160 inch స్క్రీన్ సైజ్ తో కొత్త స్మార్ట్ Projector లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!

HIGHLIGHTS

జీబ్రానిక్స్ ఈరోజు కొత్త స్మార్ట్ Projector ని మార్కెట్లో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 160 ఇంచ్ అతిభారీ స్క్రీన్ సైజ్ తో వస్తుంది

ఈ కొత్త ప్రొజెక్టర్ ను మంచి బ్యాంక్ ఆఫర్స్ మరియు No Cost EMI వంటి ఆఫర్లతో కూడా అందించింది

కేవలం రూ. 13,999 ధరకే 160 inch స్క్రీన్ సైజ్ తో కొత్త స్మార్ట్ Projector లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!

జీబ్రానిక్స్ ఈరోజు కొత్త స్మార్ట్ Projector ని మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ 160 ఇంచ్ అతిభారీ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ కొత్త ప్రొజెక్టర్ ను మంచి బ్యాంక్ ఆఫర్స్ మరియు No Cost EMI వంటి ఆఫర్లతో కూడా అందించింది. మార్కెట్లోకి జీబ్రానిక్స్ సరికొత్త తీసుకు వచ్చిన ఈ ప్రొజెక్టర్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Projector : ధర

జీబ్రానిక్స్ ఈరోజు ZEBRONICS ZEB-PIXAPLAY 24 స్మార్ట్ ప్రొజెక్టర్ ను రూ. 13,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ని 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కన్నా తక్కువ రేటుకే అందించింది. ఈ కొత్త ప్రొజెక్టర్ ఈరోజు నుంచి Flipkart ద్వారా సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ ప్రొజెక్టర్ ని HSBC, HDFC మరియు OneCard క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ ని 3 మరియు 6 నెలల EMI తో కొనే వారికి No Cost EMI ఆఫర్ ని జత చేసింది.

Also Read: MOTOROLA Edge 50 ఫోన్ ఊహించనంత తక్కువ ధరలో జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ZEBRONICS ZEB-PIXAPLAY 24 : ఫీచర్స్

జీబ్రానిక్స్ జెబ్ – పిక్స్ ప్లే 24 స్మార్ట్ ప్రొజెక్టర్ Full HD 1080p రిజల్యూషన్ కలిగి 160 ఇంచ్ స్క్రీన్ సైజు వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను గోడకు లేదా స్క్రీన్ కు పెట్టిన దూరాన్ని బట్టి పిక్చర్ ను సరిచేసే ఆటో కీస్టోన్ అడాప్షన్ మరియు ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ లో HDMI, USB, Aux అవుట్ మరియు HDMI Arc పోర్ట్ లతో పాటు బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

ZEBRONICS ZEB-PIXAPLAY 24 Smart Projector

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ చాలా కాంపాక్ట్ సైజులో ఇన్ బిల్ట్ స్పీకర్ మరియు ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా క్యారీ స్ట్రాప్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ ను ఈజీగా కనెక్ట్ చేసే మీరా క్యాస్ట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ 4000 లుమెన్స్ లైట్ తో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ రిమోట్ తో జతగా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo