OnePlus Nord 4: లీకైన వన్ ప్లస్ నార్డ్ 4 ప్రైస్.. నార్డ్ 3 కంటే చవక ధరకే వస్తోందా.!
‘వన్ ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్’ నుండి కొత్త పరికరాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం మెటల్ బాడీ మరియు కొత్త డిజైన్ తో తీసుకువస్తోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది
OnePlus Nord 4: వన్ ప్లస్ అప్ కమింగ్ బిగ్ ఈవెంట్ ‘వన్ ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్’ నుండి కొత్త పరికరాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ మరియు ట్యాబ్ ఉన్నాయి. ఇందులో, వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం మెటల్ బాడీ మరియు కొత్త డిజైన్ తో తీసుకు వస్తునట్టు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది.
SurveyOnePlus Nord 4: ప్రైస్ (లీక్)
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ ప్రైస్ ను వన్ ప్లస్ క్లబ్ X అకౌంట్ నుండి లీక్ చేసింది. కొత్తగా అందించిన ట్వీట్ నుండి ఈ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 27,999 రూపాయల ధరకే అందిస్తుందని బయటపెట్టింది. వాస్తవానికి, ప్రముఖ లీక్ స్టర్ tech home ఈ ప్రైస్ లీకైనట్లు తెలియచేసారు మరియు అతను X అకౌంట్ నుండి వివరాలను పోస్ట్ చేసారు. ఇదే విషయాన్ని మరింత కవ్విస్తూ వన్ ప్లస్ క్లబ్ X అకౌంట్ నుంచి పోస్ట్ ను షేర్ చేసింది.
OnePlus Nord 4 pricing leaked.
— Tech Home (@TechHome100) July 9, 2024
Price 💰 27999₹ (With Bank Offers)
The original price will be around 💰 31-32K #OnePlus #OnePlusNord4 pic.twitter.com/ndbArBI1Wg
ఈ ఫోన్ ప్రైస్ బ్యానర్ ఆఫర్స్ లేకుండా 31 వేల రూపాయల నుండి 32 వేల రూపాయల వరకు ఉండవచ్చని కూడా సూచించారు. ఈ కొత్త లీక్ ను చూస్తుంటే, ఈ ఫోన్ ను వన్ ప్లస్ నార్డ్ 3 కంటే తక్కువ ధరకే ఈ కొత్త ఫోన్ ను విడుదల చేస్తుందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే, ఫోన్ లాంచ్ వరకూ వైట్ చెయ్యాల్సిందే.
Also Read: Moto G85: పవర్ ఫుల్ చిప్ సెట్, Sony కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో రేపు లాంచ్ అవుతుంది.!
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ సందర్భంగా వన్ ప్లస్ కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలు తెలియపరిచింది. ఈ ఫోన్ ను ప్రీమియం మెటల్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ కొత్త డిజైన్ తో కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ గుండ్రని అంచులు కలిగిన ప్రీమియం ఫినిష్ తో వుంది.

ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో టైప్ C ఛార్జ్ పోర్ట్ వుంది. అలాగే, అడుగున అందంగా డిజైన్ చేయబడిన పెద్ద స్పీకర్ గ్రిల్ వుంది. ఈ ఫోన్ మూడు అందమైన డ్యూయల్ టోన్ కలర్స్ మరియు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది.