CMF Phone 1: అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ ఊపు పెంచిన నథింగ్ సబ్ బ్రాండ్.!

HIGHLIGHTS

నథింగ్ సబ్ బ్రాండ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ ఊపు పెంచింది

కంపెనీ ఇండియాలో మూడు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేయబోతోంది

ఇందులో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు ఇయర్ బడ్స్ ఉన్నాయి

CMF Phone 1: అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ ఊపు పెంచిన నథింగ్ సబ్ బ్రాండ్.!

CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ ఊపు పెంచింది. ఈ కంపెనీ ఇండియాలో మూడు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేయబోతోంది. ఇందులో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు ఇయర్ బడ్స్ ఉన్నాయి. నిన్నటి వరకూ ఈ ఫోన్ యొక్క వివరాలు బయటపెట్టని కంపెనీ ఇప్పుడు లాంచ్ డేట్ దగ్గర పడటంతో మెల్లమెల్లగా ఫీచర్స్ తో టీజింగ్ జోరు పెంచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Phone 1

సిఎంఎఫ్ ఫోన్ 1 యొక్క డిస్ప్లే వివరాలు బయట పెడుతూ కంపెనీ కొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో Super AMOLED డిస్ప్లే ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ డిస్ప్లే సన్నని అంచులను కలిగి పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక కలిగివున్న స్క్రూ గురించి టీజ్ చేస్తూ కూడా కొత్త టీజర్ వీడియోను అందించింది. ఈ టీజర్ ను బట్టి, ఈ ఫోన్ లో అందించిన ఈ స్క్రూ తో ఫోన్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది కాబోలు.

Also Read: జబర్దస్త్ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ 4K Smart Tv.!

అలాగే, ఈ ఫోన్ లో వెనుక రౌండ్ నాబ్ ఉన్నట్లు కూడా సూచించింది. ఇది సౌండ్ కోసం అందించిన క్లాసిక్ నాబ్ కావచ్చని ఊహిస్తున్నారు. అంతేకాదు, కంపెనీ యొక్క ఫెమస్ కలర్ లో ఈ ఫోన్ వేరియంట్ ఉంటుందని కూడా సూచించింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క ఈ వివరాలను మాత్రమే కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ జూలై 8 వ తేదీ ఇండియాలో విడుదల చేయబడుతుంది.

ఈ ఫోన్ తో పాటుగా స్మార్ట్ వాచ్ మరియు TWS ఇయర్ బడ్స్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఇందులో బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను గొప్ప సౌండ్ మరియు అద్భుతమైన డిజైన్ తో లాంచ్ చేయబొట్టునట్లు కంపెనీ తెలిపింది. అలాగే, వాచ్ ప్రో 2 స్మార్ట్ వాచ్ ను అల్యూమినియం అలాయ్ బాడీ మరియు రౌండ్ బెజెల్స్ తో పాటు రొటేటింగ్ క్రౌన్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo