OnePlus Nord CE4 Lite: 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5500mAh బిగ్ బ్యాటరీ తో వస్తోంది.!
OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ కొత్త ఫీచర్ లతో మరింత ఆటపట్టిస్తోంది
ఈ ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ ను బయట పెట్టిన కంపెనీ
ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు కెమెరా సెటప్ ను కూడా బయటపెట్టింది
OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ కొత్త ఫీచర్ లతో మరింత ఆటపట్టిస్తోంది. వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే , వన్ ప్లస్ ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ఫీచర్లతో మరింత ఆటపట్టిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ ను బయట పెట్టిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు కెమెరా సెటప్ ను కూడా బయటపెట్టింది.
SurveyOnePlus Nord CE4 Lite
వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్ ఫోన్ జూన్ 24 వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం ఇప్పటి నుండే టీజర్ పేజి అందించి ఈ పేజీ ద్వారా టీజింగ్ చేస్తోంది.
OnePlus Nord CE4 Lite: ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ ఉందని కూడా కంపెనీ తెలిపింది. అంతేకాదు ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉందని కూడా కొత్తగా కన్ఫర్మ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది.

OnePlus Nord CE4 Lite
వన్ ప్లస్ నార్డ్ CE4 లైట్ స్మార్ట్ ఫోన్ ఈ వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 52 నిముషాల్లోనే ఈ ఫోన్ ను 100% ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ చాలా నాజూకైన స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన డిస్ప్లే ఉన్నట్లు కూడా చూడవచ్చు.
Also Read: CMF Phone 1 మరియు కొత్త లైనప్ లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.!
మొత్తానికి ఈ ఫోన్ చూడటానికే కాదు ఫీచర్స్ పరంగా కూడా చైనీస్ మార్కెట్ లో ఒప్పో ఇటీవల విడుదల చేసిన ఒప్పో కె12x మాదిరిగా కనిపిస్తోంది మరియు ఇదే ఫోన్ రీబ్రాండ్ గా ఇండియా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.