HMD Arrow: Nokia యాజమాన్య కంపెనీ నుంచి మొదటి ఫోన్ వస్తోంది.!
Nokia యొక్క యాజమాన్య కంపెనీ HMD నుండి మొదటి ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది
HMD Arrow స్మార్ట్ ఫోన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు హెచ్ఎండి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది
HMD Arrow: దశాబ్ద కాలం నెంబర్ 1 మొబైల్ బ్రాండ్ గా విరాజిల్లిన Nokia యొక్క యాజమాన్య కంపెనీ HMD నుండి మొదటి ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది. అదే HMD Arrow స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు హెచ్ఎండి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే సొంత బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన హెచ్ఎండి, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెడుతోంది.
SurveyHMD Arrow Launch
హెచ్ఎండి యారో స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే, ఈ ఫోన్ ఇండియా లాంచ్ విషయాన్ని మాత్రం హెచ్ఎండి వెల్లడించింది. HMD స్మార్ట్ ఫోన్ అఫీషియల్ పార్ట్నర్ గా IPL టీం రాజస్థాన్ రాయల్స్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ప్రచార పనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ అధికారిక X అకౌంట్ నుండి ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ విషయాన్ని ప్రకటించింది.
India, thank you for naming HMD's first smartphone — the all-new HMD Arrow. 🏹📱
— Rajasthan Royals (@rajasthanroyals) May 11, 2024
Gear up for the arrival of @HMDdevicesIN Arrow in only a few weeks 💪😎 pic.twitter.com/GBSVl29HpM
HMD Arrow ఫోన్ ఎలా ఉంటుంది?
కంపెనీ ప్రస్తుతానికి హెచ్ఎండి యారో పేరును మాత్రమే కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క ఇతర వివరాలు ఇంకా బయట పెట్టలేదు. అయితే, గ్లోబల్ మార్కెట్ లో మాత్రం హెచ్ఎండి పల్స్ సిరీస్ నుంచి మూడు ఫోన్లను విడుదల చేసింది.

హెచ్ఎండి పల్స్ సిరీస్ యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ను హెచ్ఎండి యారో పేరుతో ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, భారత్ లో పెరుగుతున్న 5జి మొబైల్ వాడకానికి అనుగుణంగా తగిన ఫీచర్స్ తో 5G Smartphone ని లాంచ్ చేయవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు.
Also Read: Realme Buds Air 6: Hi-Res సర్టిఫైడ్ ఇయర్ బడ్స్ తెస్తున్న రియల్ మీ.!
అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ, త్వరలోనే హెచ్ఎండి యారో వివరాలు వచ్చే అవకాశం వుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే చాలా అంచనాలను మరియు క్రేజ్ ను హెచ్ఎండి ఇండియన్ మార్కెట్ లో రేకెత్తించింది. మరి చూడాలి ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో.