Big Deal: పెద్ద QLED Smart TV ని బ్యాగ్టే ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈరోజు మంచి ఆఫర్ Flipkart నుండి అందుబాటులో వుంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson యొక్క 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లతో చవక ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి మంచి బడ్జెట్ ధరలో అందుకు అవకాశం వుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ మరియు ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Big Deal On QLED Smart TV
స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson ఇటీవల ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన లేటెస్ట్ బిగ్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పైన ఈ బెస్ట్ డీల్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని 55% భారీ డిస్కౌంట్ తో రూ. 37,899 రూపాయల ఆఫర్ ధరకే ఈరోజు సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ బిగ్ స్మార్ట్ టీవీ పైన బర్బరీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను కూడా జత చేసింది. ఈ థామ్సన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card and EMI ఆప్షన్ తో కోనే యూజర్లకు రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ థామ్సన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Quantum Dot టెక్నలాజి కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR10 మరియు HLG సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు Dts Surround వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.
Thomson (65 inch) QLED Ultra HD (4K) Smart Google TV
అంతేకాదు, ఈ టీవీలో 40W సౌండ్ అందించగల రెండు స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ బిగ్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB మరియు బిల్ట్ ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది.