Nothing Phone (2a) కళ్ళు చెదిరే కొత్త డిజైన్ తో వస్తోంది.!
నథింగ్ అప్ కమింగ్ ఫోన్ గురించి ఆన్లైన్ లో ఇప్పటికే రచ్చ జరుగుతోంది
టీజర్ ఇమేజ్ మరియు వీడియోలతో కంపెనీ మరింత హైప్ ను పెంచింది
Glyph LED లైట్స్ తో అందమైన లుక్స్ తో నథింగ్ ఫోన్ (2a) కనిపిస్తోంది
Nothing Phone (2a) స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ మరియు వీడియోలతో కంపెనీ మరింత హైప్ ను పెంచింది. నథింగ్ అప్ కమింగ్ ఫోన్ గురించి ఆన్లైన్ లో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ ఫోన్ డిజైన్, కెమేరా మరియు స్పెక్స్ గురించి నథింగ్ ఇస్తున్న హింట్స్ లతో ఈ ఫోన్ పైన చర్చ మరింతగా పెరుగుతోంది. నథింగ్ ఫోన్ (2a) కొత్త టీజర్ తో ఈ ఫోన్ లో అందించి కెమేరా సెటప్ మరియు ఇతర వివరాలు తెలియ వస్తున్నాయి.
SurveyNothing Phone (2a) Launch

నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ ను March 5 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యడానికి టైమ్ మరియు డేట్ ను సెట్ చేసినట్లు నథింగ్ ప్రకటించింది. లాంఛ్ డేట్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫోన్ డిజైన్ ను విసరిస్తూ ఫోన్ (2a) టీజర్ ఇమేజ్ ను కూడా విడుదల చేసింది. వాస్తవానికి, ఈ ఫోన్ లో అందించనున్న ప్రోసెసర్, ర్యామ్ మరియు స్టోరేజ్ వివరాలను కంపెనీ ముందే వెల్లడించింది.
Also Read: New Launch: పిల్లల కోసం Wireless Headphones లాంఛ్ చేసిన Promate.!
నథింగ్ ఫోన్ (2a) టీజ్డ్ స్పెక్స్
నథింగ్ ఫోన్ (2a) టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక భాగం మధ్యలో డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ ఫోన్ వైట్ కలర్ ఆప్షన్ లో మరియు Glyph LED లైట్స్ తో అందమైన లుక్స్ తో నథింగ్ ఫోన్ (2a) కనిపిస్తోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ చేస్తున్న టీజింగ్ లో ఈ ఫోన్ ను లండన్ లో డిజైన్ చేసినట్లు Made In India గా తీసుకు వస్తున్నట్లు చెబుతోంది.
నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ యొక్క ప్రోసెసర్ మరియు ఇతర వివరాలను అందించింది. ఫోన్ (2a) స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 7200 Pro ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తున్నట్లు నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ ను హెవీ ర్యామ్ తో తీసుకు వస్తున్నట్లు కూడా నథింగ్ తెలిపింది. నథింగ్ ఫోన్ (2a) లో 12GB ఫిజికల్ RAM మరియు 8GB RAM Booster తో టోటల్ 20GB హెవీ RAM ఫీచర్ తో ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు నథింగ్ టీజ్ చేస్తోంది.