చవక ధరలో ఇంటిని లేదా కారును శుభ్రం చేయగల మంచి వాక్యూమ్ క్లీనర్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Ambrane ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త Mini Vacuum Cleaner ను లాంచ్ చేసింది. MiniVac 01 పేరుతో తీసుకు వచ్చిన ఈ మినీ వాక్యూమ్ క్లీనర్ కేవలం హెయిర్ డ్రయ్యర్ సైజులో మాత్రమే వుంది. అయితే, పవర్ ఫుల్ మోటార్ మరియు వివివిధ రకాలైన అటాచ్ మెంట్స్ తో కూడా వస్తుందని కంపెనీ తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
Ambrane Mini Vacuum Cleaner
అంబ్రేన్ ఈరోజు MiniVac 01 పేరుతో భారత్ మార్కెట్ లో కొత్త మినీ వాక్యూమ్ క్లీనర్ ను రూ. 1,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ వాక్యూమ్ క్లీనర్ ను కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్ మరియు అమేజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. అమేజాన్ నుండి నేరుగా కొనుగోలు చెయ్యడానికి Buy From Here పైన నొక్కండి.
అంబ్రేన్ మినీవేక్ 01 మినీ వాక్యూమ్ క్లీనర్ కార్డ్ లెస్ ఫెసిలిటీతో వస్తుంది. అంటే, ఈ వాక్యూమ్ క్లీనర్ ను ఛార్జ్ చేసి ఎటువంటి వైర్ అవసరం లేకుండా ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 నిమషాలు ఉపయోగించవచ్చు. అయితే, వైర్ తో మాత్రం కావలసినంత సమయం వాడుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ 70W పవర్ తో వస్తుంది. ఇది 4000Pa పవర్ ఫుల్ సక్షన్ తో కూడా వస్తుంది.
అంబ్రేన్ మినీవేక్ 01 ప్రత్యేకతలు
అంటే, దుమ్ము, ధూళి ఇతర మలినాలను మూల మూలాల నుండి తొలగించవచ్చు. మంచి శుభ్రతను అందించడానికి వీలుగా ఇందులో HEPA Filter లను కూడా కంపెనీ అందించింది. ఇందులోని మోటర్ 3200 RPM Speed తో పని చేస్తుంది. ఈ మినీ వాక్యూమ్ క్లీనర్ Type-C పోర్ట్ తో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు, వాషబుల్ ఫిల్టర్ లతో కూడా వస్తుంది.