Poco X6 5G: అప్ కమింగ్ పోకో ఫోన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోండి.!
Poco X6 5G గురించి బయటికి వచ్చిన ఒక కొత్త విషయం
ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో ఎక్స్6 5జి పేరుతో లాంచ్ కావచ్చు
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా జత చేశారు
పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Poco X6 5G గురించి బయటికి వచ్చిన ఒక కొత్త విషయం నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల చైనా మార్కెట్ లో Xiaomi విడుదల చేసిన Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ రీ బ్రాండెడ్ వెర్షన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో ఎక్స్6 5జి పేరుతో లాంచ్ కావచ్చు. ఈ విషయాన్ని దృవీకరించే ఒక స్క్రీన్ షాట్ తో ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. అంతేకాదు, ఈ ఫోన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ కోసం లిస్టింగ్ చేయబడినట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
SurveyPoco X6 5G
ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 13 ప్రో లాంచ్ సమయంలోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో డివైజ్ గా వస్తుందని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కు కొత్త అప్డేట్ ను జోడిస్తూ ఇది పోకో ఎక్స్6 5జి డివైజ్ కావచ్చని జోశ్యం చెప్పారు. అంతేకాదు, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా జత చేశారు. వవ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
Update: It's also POCO X6 5G. There's not yet used blob for OV64B40 camera sensor, so… Which one – Redmi or POCO – will have it in Global variant? pic.twitter.com/ANQC4DTlkH
— Kacper Skrzypek 🇵🇱 (@kacskrz) November 12, 2023
అంటే, త్వరలోనే పోకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ తో పాటుగా భారత్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉండవచ్చు. అంటే, చైనాలో విడుదలైన రెడ్ మి నోట్ 13 ప్రో యొక్క స్పెక్స్ లో చాలా వరకూ పోకో ఎక్స్6 5జి ఫోన్ లో మనం ఆశించవచ్చు. అయితే, ఇవన్నీ మన అంచనాలు మాత్రమే మరియు కంపెనీ నుండి అధికారిక అప్డేట్ తరువాతే దీన్ని మనం పూర్తిగా నమ్మే అవకాశం వుంటుంది.
Also Read : QLED Smart TV: ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లు.!
Redmi Note 13 Pro Specs (చైనా వేరియంట్)
రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో పాటుగా 16GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 200MP కెమేరా సెటప్, 5100mAh బిగ్ బ్యాటరీ మరియు 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన స్పెక్స్ మరియు ఫీచర్లు ఉన్నాయి.
గమనిక : పైన అందించిన ఇమేజ్ రెడ్ మి నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ ఇమేజ్ అని గమనించాలి