Big News: ఈ రెండు Vivo Smart Phones పైన భారీ తగ్గింపు అనౌన్స్ చేసిన వివో.!
వివో రెండు కొత్త Vivo Smart Phones ధర తగ్గించింది
ఈ రెండు వివో స్మార్ట్ ఫోన్ లు కూడా ఇప్పుడు కొత్త ప్రైస్ ట్యాగ్ తో లిస్టింగ్ చేయబడ్డాయి
ivo Y02t మరియు vivoY16 రెండు స్మార్ట్ ఫోన్ల రేట్ లలో గొప్ప తగ్గింపు అందించింది
వివో ఇటీవల భారతీయ మార్కెట్ లో విడుదల చేసిన రెండు కొత్త Vivo Smart Phones ధర తగ్గించింది. ఈ రెండు వివో స్మార్ట్ ఫోన్ లు కూడా ఇప్పుడు కొత్త ప్రైస్ ట్యాగ్ తో లిస్టింగ్ చేయబడ్డాయి. vivo Y02t మరియు vivoY16 రెండు స్మార్ట్ ఫోన్ల రేట్ లలో గొప్ప తగ్గింపు అందించింది వివో. ఈ రెండు వివో స్మార్ట్ ఫోన్ లు కూడా బడ్జెట్ ధరలో వచ్చిన 4G స్మార్ట్ ఫోన్ లు మరియు ధరకు తగిన ఫీచర్లను కలిగి ఉంటాయి.
SurveyVivo Smart Phones Price Cut
వివో వై02టి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 9,499 రూపాయల ధరలో విడుదలవ్వగా ఇప్పుడు రూ. 8,999 ధరకే లభిస్తోంది. అలాగే, ముందుగా రూ. 10,999 రూపాయల ధరతో తీసుకు వచ్చిన వివో వై16 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 10,499 రూపాయలకే అఫర్ చేస్తోంది. అంటే, ఈ రెండు వివో స్మార్ట్ ఫోన్ల పైన వివో రూ. 500 రూపాయల తగ్గింపును ప్రకటించింది.
Elevate your style game with the #vivoY02t and #vivoY16, now available at exciting new prices. #ItsMyStyle #vivo #vivoYSeries #BuyNow pic.twitter.com/h455O7qoZN
— vivo India (@Vivo_India) September 26, 2023
vivo Y02t Features

వివో వై02టి స్మార్ట్ ఫోన్ 6.51 ఇంచ్ HD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio P35 ఆక్టా కొర్ ప్రోసెసర్ తో పనిచేసే 4G ఫోన్ మరియు జతగా 4 GB RAM మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Funtouch OS సాఫ్ట్ వేర్ తో 13 Android 13 OS పైన పని చేస్తుంది.
వై02టి ఫోన్ లో వెనుక 8MP సింగల్ కెమేరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని మరియు రెగ్యులర్ ఛార్జ్ సపోర్ట్ తో వివో అందించింది. ఈ ఫోన్ సన్నగా మరియు చూడటానికి ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. Buy From Here
vivoY16 Features

ఇక వివో వై16 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ వివో ఫోన్ కూడా 6.51 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ కూడా MediaTek Helio P35 ప్రోసెసర్ తోనే పనిస్తుంది మరియు ఇందులో కూడా 4 GB RAM మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ వుంది.
అయితే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది . ఈ వివో ఫోన్ లో వెనుక 13MP + 2MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా, 5000 mAh బిగ్ బ్యాటరీని నార్మల్ ఛార్జింగ్ ఛార్జ్ టెక్ తో కలిగి వుంది. Buy From Here