జియో ధమాకా: Netflix మరియు Amazon సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే బెస్ట్ ప్లాన్స్ కస్టమర్ల కోసం అందించింది. ఈ ప్లాన్స్ మీకు Netflix మరియు Amazon ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటుగా కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, ఈ అధిక ప్రయోజనాలను జతచేసింది కేవలం పోస్ట్ ప్లాన్స్ పైన మాత్రమే అందిస్తోంది. అంటే, జియో అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ పోస్ట్ పైడ్ ప్లాన్స్ మరియు ప్రయోజనాలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించవు.ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి మరియు ఇది వీటిలో బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను గురించి తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix మరియు Amazon Prime Video లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.
ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది.
Note: పైన తెలిపిన అన్ని ప్లాన్ ధరలకు 18% GST ని కూడా కలుపుకోవలసి వుంటుంది. అంటే, Rs.399+18%GST, Rs.599+18%GST మరియుబ్ Rs.799+18%GST ఈ ప్లాన్ ధరగా గుర్తుంచుకోండి.