HIGHLIGHTS
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం జబర్దస్త్ ఆఫర్ ను అందించింది
12GB అదనపు డేటాని jio కస్టమర్లు ఉచితంగా అందుకోవచ్చు
ఈ రెండు కొత్త ప్లాన్స్ ఆఫర్ చేసే పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఈ అఫర్ ద్వారా 12GB అదనపు డేటాని jio కస్టమర్లు ఉచితంగా అందుకోవచ్చు. రిలయన్స్ జియో ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన రూ.899 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ 12GB ఉచిత డేటా ప్రయోజనాన్ని జతచేసింది. మరి ఈ రెండు కొత్త ప్లాన్స్ ఆఫర్ చేసే పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి.
Surveyజియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here