HIGHLIGHTS
తన యూజర్లకు మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న వోడాఫోన్ ఐడియా (Vi)
2023 ప్రేమికుల రోజు కానుకగా వోడాఫోన్ ఐడియా (Vi) ఉచిత డేటా అఫర్
ఈ అఫర్ కేవలం ఫిబ్రవరి 14వ తేది 2023 వరకూ మాత్రమే వర్తిస్తుంది
తన యూజర్లకు మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్న టెలికం కంపెనీలలో వోడాఫోన్ ఐడియా (Vi) కూడా ఒకటిగా చెప్పబడుతుంది. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తన కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా అఫర్ చేస్తుంది. 2023 ప్రేమికుల రోజు కానుకగా వోడాఫోన్ ఐడియా (Vi) ఉచిత డేటా అఫర్ ను కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఇప్పుడు అందించింది. అయితే, ఈ అఫర్ కేవలం ఫిబ్రవరి 14వ తేది 2023 వరకూ మాత్రమే వర్తిస్తుంది.
Surveyఈ Vi వాలంటైన్స్ డే అఫర్ ను రూ.199 రూపాయల ప్లాన్ మరియు అంతకు పైన అందుబాటులో ఉన్న అన్ని అన్లిమిటెడ్ ప్లాన్ పైన జత చేసింది. అయితే, రూ.299 రూపాయ అంతకంటే పైన ఉన్న అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ పైన 5GB ఉచిత లభిస్తుండగా, రూ.199 మరియు రూ.299 మధ్యలో ఉన్న అన్లిమిటెడ్ ప్లాన్స్ పైన 2GB ఉచిత డేటాని అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు, 'ViLoveTunes Contest' ద్వారా ప్రతిరోజూ రూ.5000 రూపాయల వోచర్ ను ఒకరు గెలుచుకునే గొప్ప అవకాశం వోడాఫోన్ ఐడియా అందించింది. vi యాప్ లోని Hungama లో వాలంటైన్స్ ప్లే లిస్ట్ నుండి మిక్స్ చేసిన లిరిక్స్ పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన యూజర్లలో డైలీ ఒక లక్కి విన్నర్ ఈ వోచర్ అందించబడుతుంది. దీనికోసం, #ViLoveTunes హ్యస్ ట్యాగ్ తో యూజర్లు ఆ పాట పైన కామెంట్ అందించాలి.