జియో, వోడాఫోన్ ఇండియా మరియు భారతీ ఎయిర్టెల్ అందిస్తున్నఅద్భుతమైన 4G దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్స్ లో బెస్ట్ ఇక్కడ మీకోసం అందిస్తున్నాము.

జియో, వోడాఫోన్ ఇండియా మరియు భారతీ ఎయిర్టెల్ అందిస్తున్నఅద్భుతమైన 4G దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్స్

మొదట్లో జియో తెచ్చిన ఆఫర్స్ తో పోటీ పడలేక మిగిలిన టెలికామ్ కంపెనీలు మొదట్లో చాల ఇబ్బందులు పడినా తరువాత పుంజుకొని దానికి ధీటుగా వాటి ప్లాన్స్ ని అందిస్తున్నాయి. అన్లిమిటెడ్ కాలింగ్, ఎక్కువ డేటా, అధిక SMS సౌలభ్యం మరియు ఆయా కంపెనీ లైవ్ ఛానెల్స్ మరియు యాప్స్ కి యాక్సెస్ తో బాటుగా తమ ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ ప్లాన్స్ లో భాగంగా  చక్కని దీర్ఘ కాలిక ప్లాన్స్ ని అందిస్తున్న వాటిలో అద్భుతమైన వాటిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 రిలయన్స్ జియో 4జి దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్

 రిలయన్స్ జియో రూ . 399 మరియు రూ . 499 ధరలతో రెండు దీర్ఘ కాలిక ప్లాన్లను అందిస్తుంది. ఇందులో భాగంగా లోకల్, STD మరియు రోమింగ్ కి అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 SMS ల పరిమితి, ఇంకా 1.5 జీబీ 4జి డేటాతో పాటుగా జియో యాప్స్ కి యాక్సెస్ ని కూడా అందిస్తుంది. పైన తెలిపిన రెండు ప్లాన్స్ కి కూడా ఇది వర్తిస్తుంది, ఐతే చెల్లుబాటు కాలంలో మాత్రమే మార్పుంటుంది.  రిలయన్స్ జియో రూ . 399 ప్లాన్ ని 84 రోజుల చెల్లుతో అందిస్తుంది మరియు 91 రోజుల చెల్లుబాటుతో రూ . 499 ప్లాన్ ఉంటుంది .

భారతి ఎయిర్టెల్ దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ కూడా జియో పోటీగా ఇంచు మించు ఒకేలా వుండే రూ . 399 ప్రీపెయిడ్ ప్లాన్ ని అందిస్తుంది. ఇందులో భాగంగా లోకల్ మరియు STD  అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 SMS ల పరిమితి, ఇంకా 1.4 జీబీ 4జి డేటాతో పాటుగా ఎయిర్టెల్ లైవ్ టీవీ కి యాక్సెస్ ఉంటుంది. 84 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్ని అందించారు, అలాగే రూ. 509 ప్లాన్ తో 9రోజుల చల్లుబాటు ఉంటుంది. ఇంకా జియో రూ. 499 ప్లాన్ కి ధీటుగా ఎయిర్టెల్ రూ. 498 లతో జియో లాంటి ఆఫర్ నే అందిస్తుంది.

వోడాఫోన్ ఇండియా దీర్ఘ కాలిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్  రూ . 458 మరియు రూ . 509 ధరలతో రెండు దీర్ఘ కాలిక ప్లాన్లను అందిస్తుంది. రోజువారీ 1.4 జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా రోజువారీ 100 SMS పరిమితితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ని అందిస్తుంది. ఇక్కడ  రూ . 458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో ఉండగా రూ . 509 ప్రీపెయిడ్ ప్లాన్ 9రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇంకా దీని అదనపు డేటా ప్లాన్ గా రూ. 511 ల ప్లాన్ కూడా ఉంటుంది, దీని ద్వారా పైన తెలిపిన వాటితో పాటు డేటాలో పెరుగుదలతో లభిస్తుంది. ఇది రోజువారీ 2జీబీ హై స్పీడ్ డేటా తో పాటుగా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo