Jio నుంచి ఈ సర్వీసెస్ క్లోజ్ …..

Jio  నుంచి ఈ సర్వీసెస్ క్లోజ్ …..

రిలయన్స్ జియో  వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్  ఇప్పుడు ఎప్పుడైనా మూసివేయవచ్చు. లేదా మీరు ఈ ఫెసిలిటీస్ కి  అదనపు డబ్బు  చెల్లించాల్సి ఉంటుంది.రిలయన్స్ జియో యొక్క ప్రైమ్ మెంబెర్స్   మొబైల్ టివి, సినిమాలు, వార్తలు, మేగజైన్లు, పాటలు సహా అన్ని సౌకర్యాలను పొందుతారు. ఈ సౌకర్యాలు మార్చి 31, 2018 వరకు ప్రైమ్ మెంబెర్స్ కోసం కొనసాగుతాయి. ఆ తర్వాత ఈ సౌకర్యాలు మూసివేయబడవచ్చు లేదా మీరు ఈ సౌకర్యాలను పొందటానికి ఎక్కువ చెల్లించాలి.ఈ సర్వీసెస్ ని  మూసివేయడానికి రిలయన్స్ జియో తరఫున ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, మార్చి 31 తర్వాత ఈ సర్వీసెస్ మూసివేసినట్లు లేదా అదనపు డబ్బు చెల్లించాలిసి వస్తుందని  ప్రజలలో అనుమానాలున్నాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే జియో కస్టమర్ల కోసం  మంచి వార్త కూడా వుంది . జియో యొక్క ప్రైమ్  కస్టమర్లు ఇప్పుడు ముందు కన్నా ఎక్కువ 4G డేటాను పొందుతారు మరియు దీనికి అదనపు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. జియో యొక్క 26 జనవరి రిపబ్లిక్ డే ఆఫర్లు ద్వారా మరింత డేటా లాభం పొందవచ్చు.

జియో యొక్క 449 రూపాయల రీఛార్జిలో రోజుకు 1 జిబి 4 జి డేటా లభిస్తుంది, ఇది ఇప్పుడు విస్తరించబడింది. ఇప్పుడు రూ .449 ను రీఛార్జ్ చేసినట్లయితే, మీరు 94 రోజుల వాలిడిటీ ను పొందుతారు మరియు 136.5 GB డేటా అందుబాటులో ఉంటుంది. అనగా, మీరు రోజుకి 1.5 GB డేటాను పొందుతారు.

అత్యంత ప్రజాదరణ రీఛార్జ్ ఆఫర్ 399 రూపాయల రీఛార్జ్ తో , మీరు 84 రోజుల వాలిడిటీ మరియు 126 GB డేటా లభ్యం  అవుతుంది. అనగా, మీరు రోజుకి 1.5 GB డేటాను పొందుతారు.

 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo