Idea నుంచి Karbonn A41 Power, A9 Indian, Yuva 2 లపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్…..

Idea నుంచి Karbonn A41 Power, A9 Indian, Yuva 2 లపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్…..

ఐడియా సెల్యులార్ కార్బన్ స్మార్ట్ఫోన్ల పై క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఐడియా యొక్క కొత్త క్యాష్బ్యాక్ ఆఫర్  Karbonn A41 Power, A9 Indian మరియు Yuva 2 స్మార్ట్ఫోన్లలో లభిస్తుంది. దీనితో పాటు, K310n, K24 + మరియు K9 జంబో వంటి ఫీచర్స్ ఫోన్స్ పై  రూ. 1000 రూపాయల క్యాష్ బ్యాక్ ఇవ్వడం ద్వారా ఐడియా వినియోగదారులకు ఇది 'ఫ్రీ' అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఐడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, Karbonn A41 Power ధర రూ. 2,999, A9 Indian ధర రూ. 3699 ఉంది. ఈ ఫోన్స్ పై ఐడియా రూ. 1500 క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దీని తరువాత ఈ ఫోన్స్ ధరలు  ఐడియా వినియోగదారుల కోసం సగానికి సగం  అవుతాయి. ఐడియా కస్టమర్ల కు 18 నెలల తరువాత  రూ.500 క్యాష్  బ్యాక్ఐడియా  మనీ వాలెట్లో లభ్యం . అలానే 36 నెలల తర్వాత రూ.1000 క్యాష్ బ్యాక్  వారు పొందుతారు.

Karbonn Yuva 2 ధర  రూ. 4999 మరియు  రూ. 2000 యొక్క క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. దీనిపై 18 నెలల తరువాత, రూ. 500 క్యాష్ బ్యాక్ మరియు 36 నెలల తరువాత రూ. 1500 క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది.

ఈ క్యాష్బ్యాక్ పొందడానికి, కాKarbonn A41 Power, A9 Indian and Yuva 2 కొనుగోలు చేసే  ఐడియా వినియోగదారులు తమ నెంబర్ పై 36 నెలల్లో మొత్తం రూ. 6000 రీఛార్జ్ చేసుకోవాలి .

వినియోగదారుడు రూ. 169 ప్లాన్  రీఛార్జ్ చేయాలి. ఇది అపరిమిత లోకల్  మరియు STD కాల్స్, ఉచిత రోమింగ్, 1GB డేటా రోజువారీ మరియు 100 SMS రోజువారీ అందిస్తుంది. దీని విలువ 28 రోజులు.

ఐడియా  కార్బన్ K310n, K24 + మరియు K9 జంబో ఫీచర్ ఫోన్స్ పై  క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. ఈ ఫోన్స్ ధరలు వరుసగా  రూ. 999, రూ. 1199 మరియు రూ. 1399 . ఐడియా యొక్క వీటన్నిటి పై  రూ. 1000 యొక్క క్యాష్ బ్యాక్ లభ్యం .

ఐడియా యొక్క క్యాష్ బ్యాక్ ను ఫీచర్ ఫోన్స్ లో పొందటానికి వినియోగదారుడు18 నెలలకు  రూ. 2700 రీఛార్జ్ చేయాలి  మరియు యూజర్  కి రూ. 500  క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత, తరువాతి 18 నెలలు, వినియోగదారులు  రూ. 2700 రీఛార్జ్ చేయాలి  మరియు యూజర్ కి రూ. 500 క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo