అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు

అమెజాన్ లో Refurbished మరియు Used స్మార్ట్ ఫోన్స్ సేల్స్ మొదలు

అమెజాన్ ఇండియా సైట్ లో ఇప్పుడు used మొబైల్స్ కూడా సెల్ అవనున్నాయి. దీనికి సంబంధించి అమెజాన్ ఈ రోజు నుండి అందరికీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే ఆల్రెడీ నేను గతంలో అమెజాన్ లో used మొబైల్స్ ను చూశాను. used మరియు Refurbished స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటాయి.

రెండింటికీ తేడా ఏంటి?
used అంటే వేరే వ్యక్తి వాడినది, అమెజాన్ తక్కువ ప్రైస్ తో తక్కువ వారేంటి తో సేల్స్ చేస్తుంది. Refurbished కూడా అవే ఆప్షన్స్ ఉంటాయి. కాని Refurbished అంటే ఫోన్ తయారు చేసిన తరువాత చేసే ప్రొఫెషనల్ టెస్టింగ్ లో కనుగొన్న చిన్నపాటి హార్డ్ వేర్ లోపాలను సరి చేస్తూ కంపెని తిరిగి బ్రాండ్ నియమాలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు resale చేస్తుంది. refurbished ఫోన్స్ sealed packaging లోనే ఉంటాయి.

అయితే ఇదేమీ కొత్త కాదు. చాలా సైట్స్ ప్రత్యేకంగా ఇలాంటి used, unboxed మరియు refurbished స్మార్ట్ ఫోన్స్ ను మాత్రమే సేల్స్ చేస్తున్నాయి.

ఇప్పుడు అమెజాన్ లో సెల్ అయ్యే ఈ ఫోన్స్ 3 విధాలుగా ఉండనున్నాయి. ఒకటి NEW, రెండవది Good, మూడవది Acceptable. ఈ మూడు టాగ్స్ తో సెల్ అవుతాయి refurbished అండ్ used ఫోన్స్.

NEW టాగ్ క్రింద ఉన్న ఫోనులు ఎటువంటి scratches లేకుండా బాగా పనిచేసే ఫోన్. Good అనే సెగ్మెంట్ లో కొద్దిపాటి గీతలు ఉండవచ్చు ఫోన్ పై. కాని బాగా పనిచేస్తున్నవి. ఇక Acceptable సెక్షన్ లో ఉన్న ఫోన్ బాగా పనిచేస్తుంటుంది కాని హార్డ్ వేర్ పరంగా స్క్రీన్ cracks, ఫోన్ బయట భాగంలో కనిపించేటట్టుగా బెంట్స్ ఉంటాయి. 

అమెజాన్ చేసే ఈ సెకెండ్ సేల్స్ లో used ఫోన్స్ లో అన్నిటికీ వారేంటి రాదు. కాని refurbished ఫోన్స్ కు 6 నెలల వారేంటి ఇస్తుంది. ఈ లింక్ లో అమెజాన్ refurbished మొబైల్స్ చూడగలరు.

ఎడిటర్ టిప్: Refurbished స్మార్ట్ ఫోన్స్ అనేవి కొనవచ్చు. ఎటువంటి ప్రమాదం లేదు. కాని కొనే ముందు అదే ఫోన్ కొత్తది ఎంత ప్రైస్ లో ఉంది చూడాలి. రెండింటికీ ఎక్కువ గాప్ ఉంటేనే కాని refurbished ప్రిఫర్ చేయటం సమంజసం కాదు. ఎక్కువ డిఫరెన్స్ తో ఉండే deals చాలా rare గా కనిపిస్తున్నాయి. అప్పట్లో నిజంగా ఎక్కువ గ్యాప్ ఉండేది. రెగ్యులర్ గా రోజూ సైట్స్ ను చెక్ చేస్తేనే కాని మీకు మంచి డీల్ దొరకదు. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo