OnePlus 15 లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 15 లాంచ్ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లాంచ్ గురించి ఫోన్ ఇమేజ్ తో సహా టీజింగ్ స్టార్ట్ చేసింది

ఈ ఫోన్ శాండ్ స్టోర్మ్ కలర్ వేరియంట్ ను వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది

OnePlus 15 లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

వన్ ప్లస్ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 15 లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ముందుగా కేవలం ఫోన్ పేరుతో మాత్రమే ఆటపట్టించిన వన్ ప్లస్, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ గురించి ఫోన్ ఇమేజ్ తో సహా టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న ముచ్చట్లు మరియు ఈ ఫోన్ గురించి ఇప్పటికే ఆన్లైన్ లో నడుస్తున్న రూమర్లు ఏమిటో తెలుసుకుందాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 15 : లాంచ్

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ కేవలం టీజింగ్ మాత్రమే చేస్తోంది. ఈ ఫోన్ శాండ్ స్టోర్మ్ కలర్ వేరియంట్ ను వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా మంచి స్లీక్ డిజైన్ లో కనిపిస్తోంది. వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి తన అధికారిక X అకౌంట్ నుంచి టీజింగ్ చేస్తోంది. వన్ ప్లస్ 13 సిరీస్ తర్వాత నేరుగా వన్ ప్లస్ 15 సిరీస్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే, మధ్యలో వన్ ప్లస్ 14 సిరీస్ ను దాటి వేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

OnePlus 15 : టీజర్ ఇమేజెస్ వివరాలు

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా వివరాలు బయటకు వెల్లడించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు కలర్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ దాదాపు వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ సైజులో ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ కలిగి ఉంది.

OnePlus 15 Launch

కెమెరా వివరాలు కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ లో కూడా వన్ ప్లస్ 13s ఫోన్ మాదిరి స్క్వేర్ బంప్ ఉంది. అయితే, ఈ ఫోన్ ఉన్న కెమెరా బంప్ కొంచెం పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో కూడా AI కోసం ప్రత్యేకమైన బటన్ ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: Bose Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

వన్ ప్లస్ 15: అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ మరియు రూమర్లు ఇప్పటికే నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్ ద్వారా, ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 లేదా Snapdragon 8 Elite 2 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చు, అని అంచనా వేస్తున్నారు. ఇందులో 1.5K రిజల్యూషన్ కలిగిన LTPO OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మూడు 50MP పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవన్నీ కూడా వన్ ప్లస్ 15 యొక్క అంచనా మరియు లీక్డ్ స్పెక్స్ అని గమనించాలి. కంపెనీ ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి ఎటువంటి అఫీషియల్ ఫీచర్ అప్డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, త్వరలోనే ఈ ఫోన్ ఒక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo