క్రిస్టల్స్ పొదిగిన కొత్త MOTOROLA Razr 60 స్పెషల్ వేరియంట్ లాంచ్ చేసిన మోటోరోలా.!
క్రిస్టల్స్ తో పొదిగిన కొత్త MOTOROLA Razr 60 స్పెషల్ ఫోన్ విడుదల
లగ్జరీ క్రిస్టల్స్ అండ్ జ్యువెలరీ బ్రాండ్ Swarovski యొక్క క్రిస్టల్స్ తో అందించింది
ఈ ఫోన్ బ్యాంక్ ప్యానల్ లో క్రిస్టల్స్ పొదిగిన కొత్త డిజైన్ తో అందించింది
మోటోరోలా లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ సిరీస్ రేజర్ 60 నుంచి క్రిస్టల్స్ తో పొదిగిన కొత్త MOTOROLA Razr 60 స్పెషల్ ఎడిషన్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫ్లిప్ ఫోన్ ను ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ క్రిస్టల్స్ అండ్ జ్యువెలరీ బ్రాండ్ Swarovski యొక్క క్రిస్టల్స్ తో అందించింది. ఈ ఫోన్ బ్యాంక్ ప్యానల్ లో క్రిస్టల్స్ పొదిగిన కొత్త డిజైన్ తో అందించింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ యొక్క
ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
SurveyMOTOROLA Razr 60 : ఫీచర్స్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను వజ్రాల మాదిరిగా మెరిసే క్రిస్టల్స్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో అందించింది. ఈ ఫోన్ మొత్తం 35 క్రిస్టల్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన లెథర్ బ్యాక్ ప్యానల్ లో ఈ క్రిస్టల్స్ ను అందించింది. ఈ ఫోన్ చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది మరియు యూనిక్ గా కనిపిస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400X చిప్ సెట్ తో అందించింది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ ఫ్లిప్ ఫోన్ లో మధ్యకు మొడత పెట్టగలిగే 6.9 ఇంచ్ AMOLED స్క్రీన్ మరియు 3.6 ఇంచ్ అవుటర్ స్క్రీన్ లను అందించింది. ఈ ఫోన్ మెయిన్ స్క్రీన్ HDR 10+, 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండవ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో చాలా పటిష్టమైన డిజైన్ తో ఉంటుంది.

కెమెరాలు పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 13MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా జెశ్చర్స్, 4K వీడియో రికార్డింగ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5 లక్షల కంటే ఎక్కువ సార్లు మొదటి పెట్టి తీసినా కూడా తట్టుకునే టైటానియం హింజ్ తో అందించింది. ఇందులో 4500 mAh బ్యాటరీ మరియు 33W టర్బో ఛార్జ్ ఫీచర్ కూడా అందించింది.
Also Read: Tecno Pova Slim 5G : అత్యంత స్లీక్ ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!
MOTOROLA Razr 60 : ప్రైస్
మోటోరోలా ఈ లగ్జరీ ఫ్లిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రూ. 54,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అఫీషియల్ సైట్ తో పాటు అన్ని రియల్ స్టోర్స్ ద్వారా సేల్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్స్ తో రూ. 49,999 ధరలో అందుకోవచ్చని మోటోరోలా తెలిపింది. ఈ కొత్త క్రిస్టల్ వేరియంట్ కేవలం ఐస్ మెల్ట్ రంగులో మాత్రమే లభిస్తుంది.