Tecno Pova Slim 5G : అత్యంత స్లీక్ ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

HIGHLIGHTS

Tecno Pova Slim 5G స్మార్ట్ ఫోన్ కోసం టెక్నో టీజింగ్ మొదలు పెట్టింది

ఈ ఫోన్ ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని సరికొత్త కెమెరా డిజైన్ కలిగి ఉన్నట్లు కూడా టీజర్ ద్వారా తెలియజేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా ఉంటుందని కంపెనీ ఈ ఫోన్ లాంచ్ టీజింగ్ ద్వారా వెల్లడించింది

Tecno Pova Slim 5G : అత్యంత స్లీక్ ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

Tecno Pova Slim 5G స్మార్ట్ ఫోన్ కోసం టెక్నో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా ఉంటుందని కంపెనీ ఈ ఫోన్ లాంచ్ టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో ఎన్నడూ చూడని సరికొత్త కెమెరా డిజైన్ కలిగి ఉన్నట్లు కూడా ఈ ఫోన్ టీజర్ ద్వారా తెలియజేసింది. టెక్నో లాంచ్ చేయబోతున్న ఈ కొత్త ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pova Slim 5G : లాంచ్ డేట్ ఏమిటి?

టెక్నో పోవా స్లిమ్ 5జి స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు టెక్నో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ ద్వారా లాంచ్ అవుతోంది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది.

Tecno Pova Slim 5G : ఫీచర్స్ ఏమిటి?

ఈ స్మార్ ఫోన్ ను ప్రపంచంలో అత్యంత స్లీక్ ఫోన్ గా లాంచ్ పరిచయం చేయబోతున్నట్టు టెక్నో గొప్పగా చెబుతోంది. అంటే, ఈ ఫోన్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఫోన్ల కంటే కూడా సన్నగా ఉండేలా తయారు చేసినట్లు చెబుతోంది. అయితే, ఈ ఫోన్ మందం ఎంతో ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఎంత సన్నగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది.

Tecno Pova Slim 5G

టెక్నో పోవా స్లిమ్ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ కూడా టెక్నో వెల్లడించింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ఫోన్ వెనుక భాగంలో పైన సన్నగా మొత్తం పరుచుకొని ఉన్న కెమెరా బంప్ ఉంటుంది. ఈ బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా అందించారు. ఇదే కాదు ఈ స్మార్ట్ ఫోన్ ELLA AI సపోర్ట్ తో కూడా లాంచ్ అవుతుంది.

Also Read: Amazon అప్ కమింగ్ సేల్ కంటే ముందే boAt Dolby Soundbar పై భారీ డీల్ ప్రకటించింది.!

ఇందులో AI రైటింగ్ అసిస్టెంట్, AI సర్కిల్ టు సెర్చ్ వంటి చాలా Ai ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ నో నెట్వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో కర్వుడ్ స్క్రీన్ ఉన్నట్లు కూడా అర్ధం అవుతోంది. ఈ ఫోన్ గురించి ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ మాత్రమే వెల్లడించింది మరియు ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని ఫీచర్స్ వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo