Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.. ఒక్కరోజు మాత్రమే.!

HIGHLIGHTS

Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి

ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రకటించిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ డిస్కౌంట్ లభిస్తుంది

మొదటి సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది

Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.. ఒక్కరోజు మాత్రమే.!

Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి అంటోంది రియల్ మీ. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రకటించిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ను కేవలం ఒక రోజు కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతుంది. అంటే, ఈ ఫోన్ ను ఆగస్టు 27న జరగనున్న మొదటి సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4 Pro First Sale ఆఫర్లు ఏమిటి?

రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో ఈ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో ఒకటి రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరొకటి రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. ఈ రెండు ఆఫర్లు కూడా రేపు జరిగే ఫస్ట్ సేల్ నుంచి పొందవచ్చు.

Realme P4 Pro ఫోన్ ప్రైస్ ఏమిటి?

ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో ఇండియాలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.

  • రియల్ మీ పి4 ప్రో (8GB + 128GB) ధర : రూ. 24,999
  • రియల్ మీ పి4 ప్రో (8GB + 256GB) ధర : రూ. 26,999
  • రియల్ మీ పి4 ప్రో (12GB + 256GB) ధర : రూ. 28,999

ఈ ఫోన్ ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme అఫీషియల్ సైట్ నుండి లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ లభించే ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

Realme P4 Pro 5G price
  • రియల్ మీ పి4 ప్రో (8GB + 128GB) ధర : రూ. 19,999
  • రియల్ మీ పి4 ప్రో (8GB + 256GB) ధర : రూ. 21,999
  • రియల్ మీ పి4 ప్రో (12GB + 256GB) ధర : రూ. 23,999

రియల్ మీ పి4 ప్రో స్పెక్స్ ఏమిటి?

రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్,144 FPS BGMI సపోర్ట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.8 ఇంచ్ 4D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో గొప్ప విజువల్స్ మరియు గుడ్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన Hyper Vision AI చిప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 తో అందించింది మరియు జతగా ఇందులో 12 జీబీ ఫిజికల్, 10 జీబీ ర్యామ్ ఎక్స్ పెన్షన్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Realme P4 Pro Price and top 5 features

ఈ ఫోన్ లో 50MP Sony IMX 896 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ రెండు కెమెరా లతో కూడా 4K వీడియో (30/60FPS) రికార్డింగ్ చేస్తుంది. అంతేకాదు, AI Edit Gane, రియల్ మీ కెమెరా ఫిల్టర్లు మరియు మరిన్ని AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo