Motorola Razr 60 మరియు Buds Loop లాంచ్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
మోటోరోలా కలెక్షన్స్ పేరుతో మోటోరోలా రీసెంట్ గా టీజింగ్ మొదలు
ఈ సిరీస్ నుంచి Motorola Razr 60 మరియు Buds Loop లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్
ఈ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు వెల్లడించింది
మోటోరోలా కలెక్షన్స్ పేరుతో మోటోరోలా రీసెంట్ గా టీజింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఈ సిరీస్ నుంచి అందించనున్న ప్రొడక్ట్స్ వివరాలు రివీల్ చేసింది. ఈ సిరీస్ నుంచి Motorola Razr 60 మరియు Buds Loop బడ్స్ లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా మోటోరోలా ఈరోజు వెల్లడించింది.
SurveyMotorola Razr 60 మరియు Buds Loop లాంచ్ డేట్ ఏమిటి?
మోటోరోలా రేజర్ 60 మరియు బడ్స్ లూప్ ను వచ్చే నెల మొదటి తేదీ, అంటే సెప్టెంబర్ 1న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ మరియు బడ్స్ ని కలెక్షన్స్ పేరుతో పిలువడానికి తగిన కారణం ఉంది. ఈ కొత్త ప్రొడక్ట్స్ ని క్రిస్టల్స్ ప్రపంచంలో పేరుగాంచిన Swarovski యొక్క ప్రీమియం క్రిస్టల్స్ తో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మరియు బడ్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ మరియు బడ్స్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి మరీ టీజింగ్ చేస్తోంది.
Motorola Razr 60 ఫీచర్స్ ఏమిటి?
ఇది మోటోరోలా రేజర్ సిరీస్ యొక్క ఫ్లిప్ ఫోన్ గా వస్తుంది. ఇది లగ్జరీ డిజైన్ మరియు ఫోన్ వెనుక భాగంలో స్వరోవ్‌స్కి యొక్క 35 క్రిస్టల్స్ తో పొదగబడి ఉంటుంది. ఈ ఫీచర్ తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అవుతుంది మరియు స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉంటుందనే విషయాలు కూడా మోటోరోలా బయటకు వెల్లడించింది.

మోటోరోలా రేజర్ 60 ఫ్లిప్ ఫోన్ లో పెద్ద అవుటర్ స్క్రీన్ ఉంటుంది మరియు క్రిస్టల్స్ తో చాలా లగ్జరీ డిజైన్ తో ఉంటుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను ఈజీగా క్యారీ చేసే స్టైలిష్ క్యారీ క్రాస్ బాడీ కేసు ను ఈ ఫోన్ తో పాటు అందిస్తున్నట్టు మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ 500K + ఫ్లిఫ్స్ తట్టుకునే టైటానియం రీన్ఫోర్స్డ్ హింజ్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 100% ట్రూ కలర్ కెమెరాలు మరియు వీడియో జెశ్చర్ కలిగిన వరల్డ్ ఫస్ట్ ఫోన్ గా వస్తుంది.
Also Read: Realme P4 5G: రూ. 3,500 భారీ ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన సేల్.!
Buds Loop ఫీచర్స్ ఏమిటి?
మోటోరోలా లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ బడ్స్ గురించి కూడా వివరాలు అందించింది. ఈ బడ్స్ లగ్జరీ డిజైన్ మరియు ఇన్నోవేషన్ జతగా అందించింది. ఈ బడ్స్ సౌండ్ బై BOSE సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో స్పేషియల్ 12mm ఐరన్ లెస్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది గొప్ప సౌండ్ అందించే మరియు చెవులకు నొప్పి కలిగించని కొత్త డిజైన్ తో ఉంటుంది. ఈ బడ్స్ ఐస్ మెల్ట్ మరియు ఫ్రెంచ్ వోక్ రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ కూడా స్వరోవ్‌స్కి క్రిస్టల్స్ తో పొదగబడి ఉంటాయి. ఈ అప్ ప్రొడక్ట్స్ గురించి ఈ వివరాలు మాత్రమే మోటోరోలా అందించింది. మరిన్ని అప్డేట్స్ కూడా తర్వలోనే అందిస్తుంది.