Lava Play Ultra 5G: గేమింగ్ కోసం కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!
కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి లావా టీజింగ్ మొదలుపెట్టింది
ఈ ఫోన్ ను గేమింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు టీజర్ ద్వారా హింట్ ఇచ్చింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది
Lava Play Ultra 5G : లావా భారతీయ మొబైల్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను గేమింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు టీజర్ ద్వారా హింట్ ఇచ్చింది. లావా తీసుకు రాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన అప్డేట్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyLava Play Ultra 5G లాంచ్ డేట్ ఏమిటి?
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా ప్లే ఆల్ట్రా 5g యొక్క లాంచ్ డేట్ ని ప్రస్తుతానికి ప్రకటించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ గురించి మాత్రం టీజింగ్ మొదలుపెట్టింది. అమెజాన్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క టీజింగ్ వివరాలు అందించడానికి లావా సిద్దమయ్యింది.
Lava Play Ultra 5G : టీజింగ్ అప్డేట్ ఏమిటి?
లావా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను గేమింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు ఈ టీజర్ లో తెలియజేసింది. ఈ ఫోన్ ను ‘లెవల్ అప్ యువర్ ప్లే’ క్యాప్షన్ తో ఈ ఫోన్ ను టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, గేమింగ్ చరిత్రలో కొత్త శకం ఇప్పుడు మొదలవుతుంది, అని ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు లావా ఇంకా బయటపెట్టలేదు.

అయితే, లావా ప్లే అల్ట్రా స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా తక్కువ అంచులు కలిగిన పెద్ద స్క్రీన్ కలిగి ఉండే అవకాశం ఉండేలా కనిపిస్తోంది. ఇదే కాదు ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఉన్నట్లు ఇదే టీజర్ ఇమేజ్ స్పష్టం చేస్తోంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విషయాల ద్వారా కొన్ని అంచనా ఫీచర్స్ ఊహించవచ్చు. లావా ఈ ఫోన్ ను గేమింగ్ కోసం తగిన లేదా అవసరమైన లేటెస్ట్ బడ్జెట్ 5జి ప్రోసెసర్ తో అందించే అవకాశం ఉండవచ్చు. అలాగే, ఈ ప్రోసెసర్ తో తగిన LPDDR 5 ర్యామ్, ఫాస్ట్ అండ్ బిగ్ స్టోరేజ్ ఈ ఫోన్ లో అందించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ గేమింగ్ కోసం అవసరమైన పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు.
Also Read: ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చే Vu QLED Smart Tv పై అమెజాన్ బిగ్ డీల్.!
అయితే, ఇపప్టి వరకు మనం కేవలం ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ తో వచ్చే అవకాశం ఉందనే అంచనా ఫీచర్స్ చర్చించాం. కానీ ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన తర్వాతే మనం అంచనా వేస్తున్న వాటిలో ఎన్ని ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయో తెలుస్తుంది.