CMF Phone 2 Pro పై భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ CMF Phone 2 Pro ని ఆఫర్ ధరలో అందుకునే అవకాశం
నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో లభిస్తుంది
నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ CMF Phone 2 Pro ని ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. 2025 లో విడుదలైన ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ తో ఈ ఫోన్ సరైన ధరలో లాంచ్ అయ్యిందని చాలా మంది టెక్ రివ్యూవర్స్ కితాబు అందుకుంది. అటువంటి ఈ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో లభిస్తుంది.
SurveyCMF Phone 2 Pro : ఆఫర్లు
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 18,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అదే ధరకు లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ చవక ధరలో లభిస్తుంది.

అవేమిటంటే, ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ పై రూ. 1,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 16,899 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ పై అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా ప్రధాన బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
CMF Phone 2 Pro : ఫీచర్లు
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ CMF ఫోన్ మాదిరి స్క్రూ ఫిట్ డిజైన్ తో వచ్చింది. అయితే, ఈ ఫోన్ మరింత స్లీక్ మరియు ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Pro 5జి ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ అదనపు ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ నథింగ్ OS 3.2 తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ LTPS స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10 + సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (GN9) అల్ట్రా వైడ్, 50MP టెలీ లెన్స్ మరియు 8MP అల్ట్రా వైడ్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Great Freedom Sale కంటే ముందు అమెజాన్ భారీ 50 ఇంచ్ Smart Tv డీల్ ప్రకటించింది.!
నథింగ్ ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ను కూడా కలిగి ఉంటుంది.