iQOO Z10R : 32MP 4K సెల్ఫీ కెమెరా మరియు స్టైలిష్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Z10R లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి
iQOO Z10R : ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Z10R లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ అనౌన్స్ చేసింది. ఐకూ జెడ్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ ను 32MP 4K సెల్ఫీ కెమెరా మరియు స్టైలిష్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
SurveyiQOO Z10R : లాంచ్ డేట్
ఐకూ జెడ్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ ను జూలై 24వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది మరియు ఈ ఫోన్ అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.
iQOO Z10R : ఫీచర్స్
ఐకూ జెడ్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ చూడగానే ఆకట్టుకునే మంచి డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఫస్ట్ లుక్ ఐకూ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 డ్యూయల్ రియర్ కెమెరా మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 32MP సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా హింట్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది.

ఇప్పటి వరకు ఐకూ అందించిన వివరాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. అయితే, ఇప్పుడు నెట్టింట్లో ఈ ఫోన్ గురించి జరుగుతున్న చర్చ, రూమర్లు మరియు అంచనా స్పెక్స్ గురించి చూద్దాం. ఈ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఐకూ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్టు క్లియర్ అయ్యింది.
ఇది కాకుండా ఈ ఫోన్ కూడా AI కెమెరా ఫీచర్స్ మరియు అనేకమైన కెమెరా ఫిల్టర్స్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ కావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఇవన్నీ కూడా అంచనా ఫీచర్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: Realme 15 Pro: ట్రిపుల్ 50MP కెమెరా మరియు 4D Curved స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!
iQOO Z10R : అంచనా ధర
ఐకూ ఈ ఫోన్ ను 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లో లంచ్ చేసే అవకాశం ఉందని రూమర్లు ఉన్నాయి. మరి ఈ ఫోన్ అసలు ధర ఎలా ఉంటుందో చూడాలి.